Saturday, September 3, 2016

One Life, One Hero..NTR (నా జీవిత కాలపు కథానాయకుడు).


One Life, One Hero.. NTR, నా జీవిత కాలపు కథానాయకుడు.




1996..జనవరి 18..గుంటూరు లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివే రోజులు.. సంక్రాంతి పండక్కి ఇంటికొచ్చా..

► బాగా నిద్రపోతుంటే పొద్దున్నే అమ్మ లేపింది.. ఇంకా నిద్ర పోతున్నావేంటి ఎన్ టి ఆర్ చచ్చిపోయాడు అంది..ఉలిక్కిపడి ఒక్కుదుటున లేచాను.. అసంకల్పితంగా నాకు తెలియకుండానే చిప్పిల్లిన కన్నీళ్లు ..ఆ కన్నీళ్ళ మధ్య మసకబారిన చూపు ..మంచం మీద నుండి కూడా లేవలేని నిస్సత్తువ..వణుకుతున్న చేతులతో ఎలాగోలా మొహం కడుక్కుని రోడ్డు ఎక్కా..గుండె గొంతులో అడ్డం పడినట్లు వాళ్లింట్లో పెద్దకొడుకే చనిపోయినట్లు ఉంది ఊరు ఊరంతా.. అప్పటికే ఊరి జనం వాళ్ల ఖర్చులతో లారీలు మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్తున్నారు తమ ఆత్మీయ సోదరుడిని చివరి చూపు చూడటానికి ..మా ఊరే కాదు .. చుట్టు పక్కల ప్రతి ఊరిది అదే పరిస్థితి..
► ఆఖరి సారి నా దేవుడిని చూద్దామనిపించి అమ్మ ని బతిమాలాను ..హైదరాబాద్ వెళ్తా అని.. అమ్మ పంపలేదు జనసముద్రం లో నేనెక్కడ మునిగిపోతానో అని.. నా జీవితంలో ఈ అత్యంత విషాద సంఘటన నన్ను కుదిపేసింది .. చదవలేకపోయాను ..పరీక్ష తప్పాను.. తినీ తినక దిగులుతో అనారోగ్యం పాలయ్యాను..ఒక్క 2 సంవత్సరాలు కోలుకోలేకపోయాను ..
► అసలు ఎవరీయన.. నన్ను , నాలా ఇలా కోట్ల మందిని ఇంత తీవ్ర భావోద్వేగానికి ఎలా గురి చేసాడు.. . నాలుగు సినిమాలు నచ్చా??..
► నా కులం ఏంటో తెలియని నాలుగైదు ఏళ్ళ వయసు కే దినప్రతికలో రోజూ పతాక శీర్షికల్లో కాషాయం వేసుకున్న ఈ దివ్యసుందర మూర్తి ఛాయాచిత్రాలు కనిపించేవి.. తీవ్రం గా ఆకర్షించేవి ..
► నాకు ఊహ తెలిసేసరికి ఆయన సినిమాలు నటించడం మానేసారు.. కానీ రోజూ పొన్నూరు జిల్లా పరిషత్ పాఠశాల కి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు దారిలో ఆయన సినిమా ఎక్కడ ఆడుతుంటే ( రెండో సారి మూడోసారి విడుదలయ్యే గుండమ్మ కథ లాంటివి) అక్కడికెళ్ళి కాసేపు తనివిదీరేలా ఆయన బొమ్మ చూసి అప్పుడు వెళ్లే వాడిని..మరి అంతటి అందగాడు మరి.
► ఇది చాలక మా అమ్మ, నాన్న , బాబాయిలు,పిన్నులు,తాతయ్య, ఒక్క మాటలో మాఊరు అందరికీ ఆయన అంటే చాలా ఇష్టం .. పైగా కథ చెప్పమని అడిగితే గులేబకావళి కథ చెప్పే మా చిన్న బాబాయి...ఆ రోజుల్లోనే దాదాపు 500 క్యాసెట్లు కొన్న మా బాబాయి అన్న గారి పాత సినిమా పాటలే ఎప్పుడూ వినేవాడు..పైగా అప్పట్లో ఎటు చూసినా పసుపు జెండా ..
► పెరిగి పెద్దవాడిని అవుతున్న కొద్దీ వయసుతో పాటు ఆయన మీద అభిమానం అంతకంతకీ ఎక్కువైంది..
ఎవరన్నా ఆయన్ని విమర్శిస్తే తిప్పికొట్టడానికి ఆయన గురించి బాగా చదివేవాడిని ..
► నాకు 12,13 ఏళ్లు వచ్చేసరికి తెల్సింది చిన్నప్పటి నుండి నేను ఇష్టపడింది
► అన్నార్తుల ఆకలి తీర్చిన వాడు
► అన్న గా ఆడపడుచులకోసం అన్నీ చేసిన వాడు
► రైతే రాజని చాటిన వాడు
► తరాల వెట్టి చాకిరీని తరిమికొట్టినవాడు
► దేశ రాజకీయాల దశ దిశ మార్చిన వాడు
► పెన్ను పోటు తో పటేల్ పట్వారీని పాతిపెట్టినవాడు
► పల్లెని పల్లకీ ఎక్కించిన వాడు
► ప్రభుత్వాలని ప్రజల ముందు మోకరిల్లేలా చేసిన వాడు
► వ్యవస్థలోని అవస్థలని రూపుమాపిన వాడు
► గాంధీల గారడీలు సాగనివ్వని వాడు
► రాజకీయాలకి రంగు రుచి తెచ్చిన వాడు
► రామరాజ్యం ఎలా ఉంటుందో రాష్ట్రానికి చూపించిన వాడు
► తెలుగుజాతికి పట్టిన తెగులు పోగొట్టిన వాడు
► అవినీతి అంటేనే అర్థం తెలియని వాడు
► మనసున పసివాడు మనిషిగా మొనగాడు
► మది తలవగానే మధురభావనకలిగించేవాడు
► పూజామందిరాల్లో ప్రజలు పటం పెట్టి పూజించుకునే ఒకే ఒక్క నాయకుడు
► అలాంటి ఆదర్శ పురుషుడు ,కారణజన్ముడు నా జీవిత కాలపు కథానాయకుడు అని..
సగర్వం గా చెప్పగలను నేను తారకరాముని అభిమాని ఎప్పటికీ అని,,
Courtesy: Sreenivas Kandru

Tags:

0 Responses to “One Life, One Hero..NTR (నా జీవిత కాలపు కథానాయకుడు).”

Post a Comment

Subscribe

Donec sed odio dui. Duis mollis, est non commodo luctus, nisi erat porttitor ligula, eget lacinia odio. Duis mollis

Designed by SpicyTricks